తిరిగి ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా పిలుచుకుంటారు కోట్లాది మంది భక్తులు. గత కొన్నేళ్లుగా తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా తిరుమల రాజకీయాలకు కేరాఫ్ గా మారింది.
శ్రీవారికి సంబంధించిన సేవలు, అన్నదానం, లడ్డూ ప్రసాదాలలో నాణ్యత లోపించిందని భక్తుల నెత్తీ నోరు బాదుకున్నా పట్టించు కోలేదు. ఇక దర్శన టికెట్లను బ్లాక్ లో అమ్మే దళారులు ఎక్కువై పోయారు. ఒక రకంగా చెప్పాలంటే మొత్తంగా తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా చేశారు ఆనాటి టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి.
స్వామి వారి కృపతో రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొత్త సర్కార్ కొలువు తీరింది. ఆ వెంటనే ఆయన తిరుమల నుంచే ప్రక్షాళన స్టార్ట్ చేశారు. వెంటనే ఈవో ఏవీ ధర్మారెడ్డిపై వేటు వేశారు. కొత్తగా ఈవోను నియమించారు. ఆయన వచ్చాక సీన్ మారింది.
కొంత కాలంగా నిలిచి పోయిన అన్న ప్రసాదం ను తిరిగి పునః ప్రారంభించింది టీటీడీ. తిరుమల లోని క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లలో భక్తులకు వీటిని అందజేస్తున్నారు.