22న ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది. కాగా ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది.
అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్ లో టికెట్లు మంజూరవుతాయని పేర్కొంది. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
అదే విధంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 23న అంగ ప్రదక్షిణం టోకెన్లు ఉదయం 10 గంటలకు జారీ చేస్తామని వెల్లడించింది టీటీడీ.
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన విడుదల చేస్తామని పేర్కొంది. వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని తెలిపింది. తిరుమల, తిరుపతిలలో జూలై నెల గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తామని తెలిపింది.
.
27న శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది టీటీడీ.