రమణ దీక్షితులు తొలగింపు
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం
తిరుమల – తిరుమల తిరుపతి పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడిగా విశిష్ట సేవలు అందిస్తూ వచ్చిన రమణ దీక్షితులను తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సోమవారం జరిగిన పాలక మండలిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ఇటీవల టీటీడీ విధానాలను తప్పు పట్టారు. శ్రీనివాసుడి పేరుతో మోసం చేస్తున్నారంటూ వాపోయారు. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలం చెందారంటూ ఆవేదన చెందారు. టీటీడీపై సంచలన కామెంట్స్ చేయడంతో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సంచలనం కలిగించింది.
తమ విధానాలపై అక్కసు వెళ్లగక్కారంటూ రమణ దీక్షితులపై టీటీడీ తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆయనపై కేసు నమోదైంది. ఇదిలా ఉండగా రమణ దీక్షితులు టీటీడీ పరిపాలన అంశాలు, అధికారులు, పోటు సిబ్బంది, జీయంగార్లపై రమణ దీక్షితులు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో టీటీడీ ప్రతిష్ఠ దిగజార్చేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీకి చెందిన సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ అధికారి మురళీ సందీప్ ఫిర్యాదు చేశారు.
దీనిపై పోలీసులు సెక్షన్ 153ఏ, 295, 295ఏ, 505(2), రెడ్‌విత్ 120 మేరకు కేసు నమోదు చేశారు.