Monday, April 7, 2025
HomeDEVOTIONALన‌వీ ముంబైలో స్థ‌లం కేటాయించాలి

న‌వీ ముంబైలో స్థ‌లం కేటాయించాలి

సీఎం ఫ‌డ్న‌వీస్ ను క‌లిసిన చైర్మ‌న్

తిరుమ‌ల – నవీ ముంబైలోని శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయం బాంద్రాలో టిటిడి సమాచార కేంద్రం నిర్మాణానికి భూమిని కోరుతూ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న మూడు రోజుల అంతర్జాతీయ ఆలయ సదస్సు సందర్భంగా స్థలం కేటాయింపు కోరుతూ ఒక అభ్యర్థన లేఖను అందజేశారు.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌తో కలిసి ఎపి, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ మెగా ఈవెంట్‌ను ప్రారంభించారు, సమావేశంలో పాల్గొన్నారు.

నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతంలో శ్రీ వారి ఆలయ నిర్మాణం కోసం గతంలో 3.61 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన టిటిడికి కేటాయించారని ఈ సంద‌ర్భంగా చైర్మ‌న్ బీఆర్ నాయుడు తెలిపారు. మరో 1.5 ఎకరాల స్థలంలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది.

అందుకే, అమ్మవారి ఆలయ నిర్మాణానికి కొంత భూమిని, బాంద్రాలో టీటీడీ సమాచార కేంద్రానికి కొంత స్థలాన్ని కేటాయించాలని టీటీడీ మహారాష్ట్ర‌ ప్రభుత్వాన్ని కోరింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments