Monday, April 7, 2025
HomeDEVOTIONALవారణాసిలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం

వారణాసిలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం

హాజ‌రైన టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు దంప‌తులు

తిరుమల – మహా కుంభమేళా సందర్భంగా వారణాసిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని బిర్లా మందిర్ లో శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని టీటీడీ ఆధ్వ‌ర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది.

ముందుగా అర్చక బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామి వారి ఉత్సవర్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు.

అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యహ వచనం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ మొదలయిన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించారు.

చివరిగా శ్రీ స్వామి అమ్మ వార్లకు నక్షత్ర హారతి, మంగళహారతి సమర్పించడం తో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్ర పర్వంగా తిలకించిన భక్తులు భక్తి పరవశంతో పులకించారు.

అనంతరం బిర్లా మందిర్ వద్దకు శ్రీ స్వామి వారిని వేంచేపు చేసి హారతి సమర్పించగా, టీటీడీ ఈవో జె.శ్యామలరావు చేతులు మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హెచ్ డీపీపీ ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజ గోపాల్, పారు పత్తేదార్ బాల సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments