DEVOTIONAL

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.64 కోట్లు

Share it with your family & friends

ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య 64,635

తిరుమ‌ల – తిరుమ‌ల‌ను సంద‌ర్శించుకునే భ‌క్తుల సంఖ్య పెరుగుతోంది. స‌గ‌టున 60 వేల నుంచి గ‌రిష్టంగా 80 వేల దాకా ఉంటున్నారు. టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది. సిబ్బంది, ఉద్యోగుల‌తో పాటు శ్రీ‌వారి సేవ‌కులు సైతం సేవ‌లు అందిస్తున్నారు. అయినా భ‌క్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల పుణ్య క్షేత్రాన్ని 64 వేల 635 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 19,553 మంది త‌ల నీలాలు స‌మ‌ర్పించారు. ఎప్ప‌టి లాగే భ‌క్తులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.64 కోట్లు వ‌చ్చింద‌ని టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు.

ఇక స్వామి వారి ద‌ర్శ‌నం కోసం రెండు కంపార్ట్మెంట్ల‌లో వేచి ఉన్నారు. స‌ర్వ ద‌ర్శ‌నం కోసం ఎలాంటి టోకెన్లు లేకుండా ఉండేందుకు సుమారు 8 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతోంద‌ని టీటీడీ తెలిపింది.