తిరుమలలో దుకాణం సీజ్
అన్యమత గుర్తు..వస్తువుల విక్రయం
తిరుమల – తిరుమలలో అన్యమత గుర్తు, పేరు కలిగిన వస్తువును విక్రయించిన దుకాణాన్ని టీటీడీ ఎస్టేట్ అధికారులు తాత్కలికంగా సీజ్ చేశారు. హైదరాబాద్ కి చెందిన శ్రీధర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం సిఆర్ఓ కార్యాలయంకు ఎదురుగా ఉన్న ఎస్ ఎన్ సి షెడ్ లో షాప్ నెంబర్ మూడు లో తమ పిల్లవాడు కోసం కొన్మ ఒక స్టీల్ కడియం ను కొనుగోలు చేశాడు. అయితే రూమ్ కి వచ్చి చూస్తే ఆ స్టీల్ కడియం మీద అన్యమత పేరు, గుర్తు కలిగి ఉండడం చూసి భక్తుడు షాక్ గురయ్యాడు.
పవిత్ర క్షేత్రంలో అన్యమతానికి చెందిన వస్తువులు విక్రయంపై ఆందోళన చెందిన సదురు భక్తుడు టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడుకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంభందిత అధికారులను దుకాణం వద్దకు వెళ్లి పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
దీంతో దుకాణం వద్దకు భక్తుడితో సహా వెళ్లిన టిటిడి ఎస్టేట్, టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ అధికారులు షాప్ ను తాత్కాలికంగా మూసివేసి విచారణకు ఆదేశించారు.