టీటీడీకి ఏఐ టెక్నాలజీ అనుసంధానం
భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం
తిరుమల – రోజు రోజుకు టెక్నాలజీలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తప్పనిసరిగా మారింది. దీంతో కొత్తగా కొలువు తీరిన టీటీడీ పాలక మండలి ఏఐని ఎలా ఉపయోగించాలనే దానిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు కంపెనీలు తమ డెమోలు ఇస్తున్నాయి.
టీటీడీ ప్రతినిత్యం వేలాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒక్కోసారి రద్దీ ఎక్కువ కావడంతో ఏకంగా 24 గంటలు కూడా పడుతోంది. దీనిని నివారించేందుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నడుం బిగించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలు, రోజుల తరబడి స్వామి వారి దర్శనం కోసం పడిగాపులు కాసే భక్తులకు 2 నుండి 3 గంటల వ్యవధిలోనే దర్శన భాగ్యం కల్పించాలని గత నెలలో జరిగిన తొలి పాలకమండలి సమావేశంలో తీర్మానం చేశారు.
అందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నిపుణులైన పలు సంస్థలు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ని కలుస్తున్నారు. ఈ క్రమంలో Ai powered facial recognized Q-management system లో అనుభవం గల…Aaseya and Ctruh రెండు సంస్థలు సంయుక్తంగా రూపొందించిన సిస్టమ్ తో చైర్మన్ దగ్గరకు వచ్చారు.
సామాన్య భక్తులకు ప్రయోజనం కలిగించడంపై ఆలోచించే బిఆర్ నాయుడు..వెంటనే బోర్డు సభ్యులను ఆహ్వానించారు,.సదరు సంస్థ ప్రతినిధులు రూపొందించిన కాన్సెప్ట్ ను బోర్డు చైర్మన్, సభ్యులకు సంస్థ ప్రతినిధులు ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
ఫేస్ రిగక్నైజేషన్ రికార్డ్ తో పాటు కియోస్కి మిషన్ స్లిప్ జనరేట్ చేస్తుంది…ఆ స్లిప్ లో కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చిన భక్తులు ఫేస్ రీడింగ్ ద్వారా లేదా బార్ కోడ్ స్లిప్ స్కాన్ ద్వారా దర్శనానికి అనుమతించే విధానాన్ని పరిశీలించారు.
ప్రస్తుతం డెమో ఇచ్చిన రెండు కంపెనీలు 14 దేశాల్లో సేవలందిస్తున్నారు….వీళ్లతో పాటు పలు సంస్థలు ముందుకొస్తున్న నేపధ్యంలో, ఆచరణ యోగ్యమైన విధానాన్ని ఫైనల్ చేసి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేయనున్నారు.