వాహనాల తనిఖీలో అప్రమత్తంగా ఉండాలి
తిరుపతి – తిరుపతిలోని అలిపిరి టోల్ గేట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వి. హర్ష వర్దన్ రాజు. స్కానర్ మానిటర్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రతి ఇమేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. అనుమానంగా ఉన్న వస్తువులను సిబ్బంది వేంటనే ఫిజికల్ గా తనిఖీ చేయాలన్నారు. వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్.పి.ఎఫ్, విజిలెన్స్ సిబ్బందికి సూచించారు. వాహనాలు రద్దీగా ఉన్నాయని, తనిఖీలు చేస్తున్న సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించ వద్దని హెచ్చరించారు.
టోల్ గేట్ వద్ద తిరుమలకు వెళ్ళుతున్న భక్తుల వాహనాలు ఎలాంటి ఆలస్యం కాకుండా చూడాలని సిబ్బందిని అదేశించారు. తిరుమలకు వెళ్ళుతున్న ద్విచక్ర వాహనాలు, కార్లులోని వస్తువులను సిబ్బంది ఎప్పటికప్పుడు చెకింగ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అలిపిరి టోల్ గెట్ వద్ద విఐపి వాహనాలు, సామాన్య ప్రజల కార్లు వెళ్ళు మార్గంలతో పాటు ద్విచక్ర వాహనాలు వెళ్ళు మార్గాలను పరిశీంచి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏవిఎస్ వో రమేష్, ఎపిఎఫ్ భాస్కర్ , ఎస్ ఐ ఎపిఎఫ్ మణి సిద్దార్థ్ ,విజిలెన్స్ సిబ్బంది తోపాటు ఎస్ పి ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.