ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సెబీ చైర్మన్ గా తుహిన్ కాంత పాండేను నియమించింది. ప్రస్తుతం సెబీ చైర్ పర్సన్ మాదిబి పూరి బుచ్ నుండి పాండే బాధ్యతలు చేపట్టారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం పొందిన తర్వాత ఆర్థిక కార్యదర్శిగా పని చేస్తున్న తుహిన్ కాంత
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి మూడేళ్ల కాలానికి కొత్త ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆర్థిక లావాదేవీలకు కేరాఫ్ గా సెబీ ఉంటోంది. ఆయన నియామకం మరింత సంస్థను బలోపేతం చేస్తుందన్నారు మోదీ.
మార్చి 2, 2022న పదవీ బాధ్యతలు స్వీకరించిన పదవీ విరమణ చేసిన సెబి చైర్‌పర్సన్ మాధబి పూరి బుచ్ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆమె పదవీ కాలం శుక్రవారం నాటితో ముగిసింది. ఇదిలా ఉండగా తుహిన్ కాంత పాండే ఒడిశా కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ IAS అధికారి.
చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ, UK నుండి MBA పట్టా పొందారు. ఆయన ఒడిశా ప్రభుత్వం,భారత ప్రభుత్వం రెండింటిలోనూ వివిధ పాత్రల్లో పనిచేశారు.
తన కెరీర్ ప్రారంభంలో, ఆయన ఒడిశా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (OSFC) మరియు ఒడిశా స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (OSIC) లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. తరువాత ఆయన సంబల్‌పూర్ జిల్లా కలెక్టర్ , జిల్లా మేజిస్ట్రేట్ పదవిని నిర్వహించారు .