NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ వ‌స్తానంటే కాంగ్రెస్ ఓకే

Share it with your family & friends

తుల‌సీ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్

అమ‌రావ‌తి – మాజీ పీసీసీ చీఫ్ తుల‌సీ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒక‌వేళ మ‌న‌సు మార్చుకుని కాంగ్రెస్ పార్టీలోకి వ‌స్తానంటే చేర్చుకునేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు తుల‌సీ రెడ్డి. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

మొన్న‌టికి మొన్న ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న వైఎస్ ష‌ర్మిలా రెడ్డికి ఉన్న‌ట్టుండి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆమెకు అంతా రాజ్య‌స‌భ సీటు ఇస్తార‌ని అనుకున్నారు. కానీ మొండి చేయి చూపించారు. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల‌లో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నారు.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌నా ప‌రంగా విఫ‌లం అయ్యారంటూ ఆరోపించారు తుల‌సీ రెడ్డి. ఒక‌వేళ త‌ను గ‌నుక ఇండియా కూట‌మిలోకి వ‌స్తానంటే చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంద‌న్నారు. టీడీపీకి భార‌తీయ జ‌న‌తా పార్టీ గ‌నుక మ‌ద్ద‌తు ఇవ్వ‌క పోతే క‌నీసం ఆ పార్టీకి రాష్ట్రంలో 30 సీట్లు కూడా రావ‌ని జోష్యం చెప్పారు. అందుకే చంద్ర‌బాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కాళ్ల మీద ప‌డ్డారంటూ ఎద్దేవా చేశారు.