DEVOTIONAL

అంగ‌రంగ వైభోగం తుల‌సి ఉత్స‌వం

Share it with your family & friends

పెద్ద ఎత్తున పాల్గొన్న శ్రీ‌వారి భ‌క్తులు

తిరుప‌తి – తిరుమ‌ల పుణ్య క్షేత్రం శ్రీ‌వారి భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్న భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. టీటీడీ ఆధ్వ‌ర్యంలోని ఆల‌యాల‌న్నీ పూజ‌లు, భ‌క్తుల ర‌ద్దీతో నిండి పోయాయి.

ఇందులో భాగంగా తిరుప‌తిలో కొలువై ఉన్న‌ శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయంలో తులసీ మహోత్స‌వాన్ని టీటీడీ అంగ రంగ వైభ‌వోపేతంగా నిర్వ‌హించింది.

ఉత్సవాలను పుర‌స్క‌రించుకుని ప్రతి రోజూ కైంకర్యాలు, విశ్వ రూప దర్శనం చేప‌ట్టారు . అనంతరం స్వామి వారు ఉదయం గరుడ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగారు. సుదూర ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తుల‌కు వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేసింది టీటీడీ.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి (ఈవో) జె. శ్యామ‌ల రావు కీల‌క సూచ‌న‌లు చేశారు. భ‌క్తులు నిర్దేశించిన టైం స్లాట్ కంటే ముందు రావ‌ద్ద‌ని కోరారు. దీని వ‌ల్ల ద‌ర్శ‌నం ఆల‌స్యం అవుతోంద‌ని, దీనిని గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని కోరారు ఈవో.

ఇక న‌వంబ‌ర్ నెల కోటా ద‌ర్శ‌నానికి సంబంధించి ఆగ‌స్టు 19న ద‌ర్శ‌న కోటా టికెట్ల‌ను ఆన్ లైన్ లో విడుద‌ల చేస్తున‌న‌ట్లు తెలిపారు.