విడుదల చేశామన్న మంత్రి తుమ్మల
హైదరాబాద్ – రాష్ట్రంలో 17 లక్షల 3 వేల మంది రైతులకు చెందిన ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక ఎకరం వరకు, సాగులో ఉన్న భూములకు ఇచ్చామని చెప్పారు.
పథకం ప్రారంభోత్సం నాడు విడుదల చేసిన నిధులతో కలుపుకుని ఇవాల్టి వరకు మొత్తం రూ. 1124.54 కోట్లు జమ చేశామన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు తుమ్మల.
ప్రస్తుతం దశల వారీగా నిధులను జమ చేస్తూ వస్తున్నామని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ కావాలని రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందన్నారు. కానీ తాము మాట ఇచ్చామంటే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు తుమ్మల నాగేశ్వర్ రావు.