హరీశ్ ఆరోపణ తుమ్మల ఆవేదన
కంట తడి పెట్టిన తెలంగాణ మంత్రి
హైదరాబాద్ – తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కంట తడి పెట్టారు. ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు. మంగళవారం తుమ్మల నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
కేసీఆర్ హయాంలో కట్టిన సీతారామ ప్రాజెక్టుకు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ప్రారంభోత్సం చేస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు తన్నీరు హరీశ్ రావు. తామే కట్టినట్టు క్రెడిట్ పొందాలని చూస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు తుమ్మల నాగేశ్వర్ రావు. సీతారామ ప్రాజెక్టు విషయంలో తాము క్రెడిట్ తీసుకోవాలని అనుకోవడం లేదన్నారు. గతంలో కట్టిన ప్రాజెక్టుల గురించి తామే కట్టామని ఎక్కడా చెప్పలేదని అన్నారు మంత్రి.
ముందు వెనుకా ఆలోచించకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని ఆరోపించారు. ఇలాంటి చౌకబారు కామెంట్స్ చేయడం మానుకోవాలని సూచించారు తుమ్మల నాగేశ్వర్ రావు.