వెల్లడించిన కల్నల్ సోఫియా
ఢిల్లీ – భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు టర్కీ ఇచ్చిందని ఆరోపించారు ఇండియన్ కల్నల్ సోఫియా ఖురేషి. నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300 నుంచి 400 వరకు డ్రోన్లతో దాడి జరిగిందన్నారు. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్, నాన్ కైనెటిక్స్ సాధనాలతో ఈ డ్రోన్లను నాశనం చేశామన్నారు. అలాగే పాకిస్తాన్ మిస్సైల్ దాడి కూడా చేసిందన్నారు. దాన్ని గుర్తించి నాశనం చేశామన్నారు.
సోఫియా ఖురేషీ మీడియాతో మాట్లాడారు. భారత్ చేసిన సాయం మరిచి శత్రు దేశానికి సాయం చేసిందన్నారు. 2023 సంవత్సరంలో భూకంపం వచ్చి తీవ్రంగా నష్టపోయిన టర్కీ దేశానికి ఇండియన్ ఆర్మీని పంపి ఆపరేషన్ దోస్త్ పేరిట 8,45,590 డాలర్ల విలువైన సామగ్రి దేశం అందించి రక్షణ చర్యలు చేసి ఎంతో సహాయం చేశామన్నారు. ఆపదలో సహాయం చేసిన మిత్రుడిని మరిచిన టర్కీ దేశాధినేతలు నీతి మాలిన చర్యలకు పాల్పడి మిత్రద్రోహం చేసాశారంటూ మండిపడ్డారు.