టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్
టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 2026లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. చరిత్ర తిరగ రాస్తామని చెప్పారు. మహాబలిపురంలో టీవీకే పార్టీ మహానాడు బహిరంగ సభలో ప్రసంగించారు. పెత్తందారులు, భూస్వాములు రాజకీయాలు చేస్తున్నారని, తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల్లో గెలుస్తాం..సామాన్యులకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. 1967లో రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయని, రాబోయే రోజుల్లో అదే రిపీట్ కాబోతోందన్నారు. త్వరలోనే ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు తమ పార్టీలో చేరబోతున్నారంటూ బాంబు పేల్చారు.
ఇదిలా ఉండగా టీవీకే పార్టీ తొలి వార్షికోత్సవ సభలో ప్రధాన ఆకార్షణగా నిలిచారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్. ఆయన గతంలో జరిగిన ఎన్నికల్లో డీఎంకే పార్టీకి సపోర్ట్ చేశారు. ఆ పార్టీని పవర్ లోకి తీసుకు రావడంలో కీకల పాత్ర పోషించారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో విజయ్ ను గెలుపు తీరాలకు చేరుస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.