యుద్ధానికి సిద్దం ఎన్నికలకు సన్నద్ధం
ప్రకటించిన టీవీకే ప్రెసిడెంట్ విజయ్
తమిళనాడు – టీవీకే పార్టీ అధ్యక్షుడు , సూపర్ స్టార్ తళపతి విజయ్ సంచలన కామెంట్స్ చేశారు. తమ పార్టీ విజన్ ఏమిటో స్పష్టం చేశాడు. లక్షలాది జనం తరలి రావడంతో విల్లుపురం జనసంద్రంగా మారి పోయింది. ఎక్కడ చూసినా జనమే. ఇసుక వేస్తే రాలనంత జనం.
అశేష జన వాహనిని ఉద్దేశించి ప్రసంగించారు టీవీకే చీఫ్ తళపతి విజయ్. నేను ధృడమైన మనస్సుతో ఇక్కడికి వచ్చాను. వెనక్కి తిరిగి చూసుకోలేదన్నారు. ఇది సోషల్ మీడియా కోసం చేస్తున్న సభ కాదన్నారు. ఇది సామూహిక సమావేశం. మనం ఏం కోల్పోయామో దానిని తిరిగి తెచ్చుకునేందకు నిర్వహించిన సభ అని ప్రకటించారు తళపతి విజయ్.
రాజకీయాలు సినిమా పరిశ్రమ కంటే భిన్నమైనవని అన్నారు. దానిని ఆయన యుద్ద భూమిగా పేర్కొన్నారు. ఇందుకు సిద్దపడే తాను రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు. ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించారు తళపతి విజయ్. మనందరం ఒక్కటే. మీరంతా నా వైపున ఉన్నారు. ఇక నుంచి మీరు ఎవరి జెండాలు మోయనక్కర్లేదన్నాడు. కేవలం ఒకటే జెండా..ఒకటే పార్టీ..ఒకటే కులం..మతం అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
2026లో జరిగే శాసన సభ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలలో టీవీకే పార్టీ పోటీ చేస్తుందని, ఇప్పటి నుంచే యుద్దానికి సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు.