టీవీఎస్ నికర విలువ రూ. 29,900 కోట్లు
సుందరం కూతురు లక్ష్మీ వేణు సెన్సేషన్
తమిళనాడు – రాష్ట్రానికి చెందిన వ్యాపార దిగ్గజం టీవీఎస్ ఆదాయం గణనీయంగా పెరగడం విస్తు పోయేలా చేసింది. ఓ వైపు మార్కెట్ పరంగా ఎంతో పోటీ ఉన్నప్పటికీ తన మార్కెట్ తగ్గకుండా వ్యాపారాన్ని విస్తరిస్తూ వస్తోంది. ఆదాయాన్ని గడిస్తూ ఇతర సంస్థలకు పోటీదారుగా ఉంటోంది టీవీఎస్.
ప్రధానంగా మధ్య, దిగువ తరగతి ప్రజలు టీవీఎస్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. వాటితో అనుసంధానం కావడం కొన్ని తరాల నుంచి వస్తూనే ఉంది. తాజాగా సుందరం కూతురు లక్ష్మీ వేణు సంచలనంగా మారారు. దేశ వ్యాప్తంగా ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
టీవీఎస్ గ్రూప్ గొడుగు కిందకు వస్తుంది సుందరం క్లేటన్ లిమిటెడ్ (ఎస్సీఎల్) . సదరు సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు లక్ష్మీ వేణు. మార్చి 26 , 2024 నాటికి ఎస్సీఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 18,857 కోట్లు కలిగి ఉండడం విశేషం.
భారతీయ బిలియనీర్ గా గుర్తింపు పొందారు తన తండ్రి వేణు శ్రీనివాసన్. ఇక ఆయన నిజమైన నికర విలువ అక్షరాల రూ. 29,900 కోట్లు. ఇదిలా ఉండగా లక్ష్మీ వేణు 2010లో ఎస్సీఎల్ కు ఎండీగా బాధ్యతలు చేపట్టారు. అదే క్రమంలో టేఫ్ మోటార్స్ అండ్ ట్రాక్టర్స్ లిమిటెడ్ కు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు.
యుఎస్ లోని యేల్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ లో డిగ్రీ చేశారు. ఇంగ్లండ్ లోని వార్విక్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో డాక్టరేట్ సాధించింది. తన తాత సుందరం అయ్యంగార్ వారసురాలిగా తను గుర్తింపు పొందుతోంది.