BUSINESSTECHNOLOGY

‘ఎక్స్’ ముందంజఫేస్ బుక్ ..ఇన్ స్టా వెనుకంజ‌

Share it with your family & friends

సోషల్ మీడియాలో ఎక్స్ నెంబ‌ర్ వ‌న్

అమెరికా – టెస్లా సీఈవో, ట్విట్ట‌ర్ చైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఎలోన్ మ‌స్క్ సార‌థ్యంలోని ప్ర‌ముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్ట‌ర్ ఎక్స్ రికార్డ్ బ్రేక్ చేసింది. సామాజిక మాధ్య‌మాల‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది.

జుక‌ర్ బ‌ర్గ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ను సంద‌ర్శించే వారి సంఖ్యను అధిగ‌మించింది ఎక్స్ . ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ వెబ్ సంస్థ వివ‌రాలు వెల్ల‌డించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మందిని క‌నెక్ట్ చేయ‌డంలో ఎలోన్ మ‌స్క్ ఎక్స్ ముందంజ‌లో కొన‌సాగుతోంద‌ని తెలిపింది.

ట్విట్ట‌ర్ త‌ర్వాతే ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, వాట్సాప్ , టంబ్ల‌ర్ , యూట్యూబ్ మాధ్య‌మాలు ఉన్నాయ‌ని పేర్కొంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మంగ‌ళ‌వారం త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు సంస్థ అధిప‌తి ఎలోన్ మ‌స్క్.

రాబోయే రోజుల్లో ఎక్స్ లో మ‌రిన్ని కీల‌క‌మైన మార్పులు ఉంటాయ‌ని ఈ సంద‌ర్బంగా వెల్ల‌డించారు . ఖాతాదారులకు అద్బుత‌మైన ఫీచ‌ర్స్ ను అందించే ప‌నిలో ప‌డ్డామ‌ని తెలిపారు. ఎక్స్ మ‌రింత ముందంజ‌లోకి వెళ్లేలా ప్ర‌య‌త్నం చేసిన సిబ్బంది, ఉద్యోగుల‌కు మ‌స్క్ కంగ్రాట్స్ తెలిపారు.