కోల్ కతాకు చెందిన భక్తుడి ఔదార్యం
తిరుమల – కలకత్తాకు చెందిన మోటోవోల్ట్ సీఈఓ తుషార్ చౌదరి రూ.2.45 లక్షలు విలువైన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను టీటీడీకి విరాళంగా అందించారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట జెఈవో వీరబ్రహ్మంకు మోటోవోల్ట్ సంస్థ ప్రతినిధులు స్కూటర్ తాళాలు అందించారు. ఇదిలా ఉండగా ప్రతి నిత్యం లక్షలాది మంది తిరుమలకు వస్తుంటారు. ఈ పుణ్య క్షేత్రంలో కొలువు తీరిన శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకుంటే పుణ్యం దక్కుతుందని భఖ్తుల ప్రగాఢ విశ్వాసం.
కోరిన కోర్కెలు తీరుతాయని, ఆశించిన ఫలితం లభిస్తుందని, ఆయు రారోగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. ఆ దేవ దేవుడు, కలియుగ నాథుడికి నిత్యం ఎవరో ఒకరు ఏదో ఒక విరాళం అందజేస్తూ ఉంటారు.
తమ కోరుకున్న కోర్కెలు తీరితే స్వామి వారి చెంతకు విచ్చేస్తారు. తమకు తోచిన రీతిలో కానుకలను, బహుమతులను సమర్పించుకుంటారు. తాజాగా మెటా వోల్ట్ సిఈవో స్వామి వారి కోసం విద్యుత్ వాహనాలను అందజేశారు. ఈ సందర్బంగా జేఈవో వీర బ్రహ్మం ఆయనను అభినందించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.