నిల్వలు పెంచుతామన్న యూబీ సంస్థ
హైదరాబాద్ – తెలంగాణలో మద్యం బాబులకు తీపి కబురు చెప్పింది సర్కార్. తగ్గిన బీర్ల నిల్వలపై కీలక ప్రకటన చేసింది యూబీ సంస్థ. నిలిపి వేసిన బీర్ల సరఫరాను తిరిగి పునరుద్దరిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఎలాంటి బీర్ల కొరత అంటూ ఉండదని పేర్కొంది.
బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై బేవరేజ్ కార్పొరేషన్ సానుకూలంగా స్పందించింది. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సర్కార్ హామీ ఇచ్చిందని, అందుకే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.
వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గత భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ బేవర్జీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా డబ్బులు రావాల్సి ఉందని యూబీ సంస్థ ప్రకటించింది.
పెద్ద ఎత్తున బకాయిలు పేరుకు పోవడంతో, బీర్లను పునరుద్దరించడం సాధ్యం కాదంటూ పేర్కొంది. ఈ తరుణంలో సర్కార్ దిగి వచ్చింది. సాధ్యమైనంత త్వరలోనే పేరుకు పోయిన బకాయిలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.