NEWSNATIONAL

ఉద్ద‌వ్ ఠాక్రే స‌క్సెస్ ఫుల్ లీడ‌ర్

Share it with your family & friends

ప్ర‌శంసించిన పార్ల‌మెంట్ స‌భ్యులు

మ‌హారాష్ట్ర – మ‌రాఠా మాజీ ముఖ్య‌మంత్రి, శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే అరుదైన ఘ‌న‌త‌ను సాధించారు. ఆయ‌న పార్టీ నాయ‌కుడిగా త‌న కాలంలో ఏ ఒక్క రోజు త‌న ప‌నిని విస్మ‌రించ లేదు. ప్ర‌తి రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా అసెంబ్లీకి హాజ‌ర‌య్యారు. అంతే కాదు ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. ఆపై వాటి ప‌రిష్కారం కోసం పోరాడారు. ప్ర‌జాస్వామ్య బ‌ద్ద‌మైన రాజ్యాంగం ప‌ట్ల ఆయ‌న త‌న విధేయ‌త‌ను చాటుకున్నారు.

అంతే కాదు మ‌రాఠా యోధుడిగా గుర్తింపు పొందిన బాల్ ఠాక్రేకు త‌న‌యుడిగా పేరు తీసుకు వ‌చ్చేలా చేశాడు. ఇదే స‌మ‌యంలో త‌ను సామ్నా ప‌త్రిక‌కు సంపాద‌కుడిగా ఉన్నారు. ఆచి తూచి మాట్లాడే ఉద్ద‌వ్ ఠాక్రే ఎంద‌రో మ‌న‌సులు చూర‌గొన్నారు. అంతేకాదు ఆయ‌న క‌లం ఎల్ల‌ప్ప‌టికీ క‌వి హృద‌యాన్ని క‌లిగి ఉంటుంద‌ని త‌న భార్య కితాబు ఇవ్వ‌డం విశేషం.

ఇదే స‌మ‌యంలో ఈసారి మ‌రాఠాలో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో శివ‌సేన యూబీటీ పార్టీ అత్య‌ధిక స్థానాల‌ను గెలుచు కోవ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన ఇండియా కూట‌మిలో ఆయ‌న భాగ‌స్వామిగా ఉండ‌డం విశేషం.