NEWSNATIONAL

బీజేపీకి భంగం త‌ప్ప‌దు

Share it with your family & friends

మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే

ముంబై – శివ‌సేన యుబిటి చీఫ్ , మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే నిప్పులు చెరిగారు. ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీని ఏకి పారేశారు. దేశంలో కొలువు తీరిన మోడీ స‌ర్కార్ కు ప్ర‌తిప‌క్షాల‌పై ఆడి పోసుకోవ‌డం త‌ప్పించి వేరే ప‌నేం ఉందంటూ ప్ర‌శ్నించారు.

ఆరు నూరైనా అమిత్ షా, మోడీ ఆట‌లు సాగ‌వ‌న్నారు. వారికి ప్ర‌జ‌లు త‌గిన రీతిలో గుణ‌పాఠం చెప్పార‌ని, రాబోయే రోజుల్లో కూడా బీజేపీతో కూడిన ఎంవీఏ కూట‌మికి పరాజ‌యం త‌ప్ప‌ద‌ని జోష్యం చెప్పారు ఉద్ద‌వ్ ఠాక్రే.

మ‌రాఠాలో ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన కూట‌మికి ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని, రాబోయే శాస‌న సభ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతామ‌ని చెప్పారు. ఉద్ద‌వ్ ఠాక్రే శ‌నివారం మీడియాతో మాట్లాడారు. మేమంతా ఒక్క‌టిగా ఉన్నామ‌ని, త‌మ‌కు ఢోకా లేద‌న్నారు. కూట‌మిలో చీలిక‌లు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తే చివ‌ర‌కు షాక్ కు గురి కావాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

హ‌ర్యానా, మ‌రాఠా, జ‌మ్మూ కాశ్మీర్, జార్ఖండ్ ల‌లో రాబోయే రోజుల్లో త‌మ‌దే గెలుపు అని స్ప‌ష్టం చేశారు.