NEWSNATIONAL

భార‌త కూటమిదే ప్ర‌భుత్వం

Share it with your family & friends

ఉద్ద‌వ్ ఠాక్రే సీరియ‌స్ కామెంట్స్
మ‌హారాష్ట్ర – ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన భార‌త కూట‌మికి ఈసారి భారీ ఎత్తున సీట్లు రానున్నాయ‌ని జోష్యం చెప్పారు శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ చీఫ్ , మాజీ మ‌రాఠా సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే. శుక్ర‌వారం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు.

కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్ కూల‌డం ఖాయ‌మ‌న్నారు. అధికారం ఉంది క‌దా అని నిరంకుశంగా పాల‌న సాగించిన ప్ర‌ధాన‌మంత్రికి చుక్క‌లు చూపించ‌డం త‌ప్ప‌ద‌న్నారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని, వారంతా బీజేపీ పాల‌న వ‌ద్ద‌ని అనుకుంటున్నార‌ని తెలిపారు.

543 లోక్ స‌భ స్థానాల‌కు గాను భార‌తీయ కూట‌మికి క‌నీసం 256 సీట్ల‌కు పైగా సీట్లు వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు ఉద్ద‌వ్ ఠాక్రే. త‌మ కూట‌మికి స్ప‌ష్ట‌మైన విజ‌న్ ఉంద‌ని చెప్పారు. కొత్త‌గా కొలువు తీరే ప్ర‌ధాన మంత్రి మ‌హారాష్ట్ర గౌర‌వాన్ని మ‌రాఠా ప్ర‌జ‌లంద‌రికీ తిరిగి ఇస్తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని తెలిపారు. వ‌ర్గాల మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు మోదీ చేసిన ప్ర‌య‌త్నం బెడిసి కొట్ట‌డం ఖాయ‌మ‌న్నారు.