NEWSNATIONAL

హేతువాదం..స‌మాన‌త్వ‌మే మా ఎజెండా

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ఉద‌య‌నిధి
త‌మిళ‌నాడు – స‌నాత‌న ధ‌ర్మానికి తాను వ్య‌తిరేకం అని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు త‌మిళ‌నాడు డిప్యూటీ సీఎం ఉద‌య‌నిధి స్టాలిన్. ఈ సంద‌ర్బంగా ఆల‌యాల వ‌ద్ద త‌న ఫోటోను తొక్కుకుంటూ పోవ‌డం, ఇందుకు సంబంధించి ఫోటోలు, వీడియోల‌ను షేర్ చేయ‌డం, ట్రోల్స్ చేయ‌డం ప‌ట్ల స్పందించారు ఉద‌య‌నిధి స్టాలిన్. బుధ‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

తమ రాజకీయ పరిపక్వత ఎంతగానో బట్టబయలు అయి నన్ను అవమానిస్తున్నారని అనుకునేంతగా బట్టబయలు పడి నిలబడిన బడుగుల పట్ల నాకు జాలి కలుగుతుందన్నారు. శత్రువులు మనపై ఇంత కోపంగా ఉంటే, నేను ద్రావిడ సూత్రాన్ని ఎంత బాగా పాటిస్తున్నానో దానికి నిదర్శనంగా నేను చూస్తున్నానని పేర్కొన్నారు.

ఆనాడు పెరియార్‌పై చెప్పులు విసిరారు. అంబేద్కర్ ను ఎంతగానో అవమానించారు. అయినా ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌లేదు. తాము న‌మ్మిన విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నార‌ని ఈ సంద‌ర్బంగా గుర్తు చేశారు. మన సమానత్వ సూత్రం వారికి చిరాకు తెప్పిస్తుంది. పుట్టుకతో మతం వేరు అనే విధానం గురించి మాట్లాడి ప్రజలను గెలిపించు కోలేక పోయామన్న నైరాశ్యమే మా విజయమ‌ని పేర్కొన్నారు ఉద‌య‌నిధి స్టాలిన్.

వారు నా ఫోటోను మరింత క్షుణ్ణంగా తొక్కనివ్వండి. మేము వారి మురికి మెదడులను శుభ్రం చేయలేం. కానీ కనీసం వారి పాదాలైనా శుభ్రంగా ఉండనివ్వండి అని ఎద్దేవా చేశారు.

సోదరులు, సోదరీమణులారా దీనికి కోపం తెచ్చుకోకండి. దీనిపై స్పందించడం మానుకోండి అని స‌ల‌హా ఇచ్చారు. ఫాద‌ర్ పెరియార్, అన్నాళ్ అంబేద్క‌ర్ ల బాట‌లో హేతువాదాన్ని ఆశ్ర‌యిద్దాం స‌మాన‌త్వం కోసం పోరాడుదామ‌ని పిలుపునిచ్చారు ఉద‌య‌నిధి స్టాలిన్.