Wednesday, April 2, 2025
HomeDEVOTIONALటీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు

టీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు

పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, నేతలు

అమ‌రావ‌తి – టీడీపీ కేంద్ర కార్యాలయంలో సిద్ధాంతి మాచిరాజు వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. తెలుగు ప్రజలకు ముఖ్య పండుగల్లో ఉగాది మొదటి పండుగ. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది . కాబట్టి కొత్తగా పనులకు శ్రీకారం చుడతారు. షడ్రుచుల సమ్మేళనం (తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగు వారికి మహా ప్రసాదం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.

ఈ సందర్భంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్న నేతలు మాట్లాడారు. తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం ఉగాది నుండి కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు దూరమై రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలని.. ఆరోగ్య వంతమైన జీవితాలతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలన్నారు. అలాగే ప్రజా సంక్షేమానికి ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నేత నారా లోకేష్ లకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను అందించి వారు నిత్యం ప్రజా సేవకు పాటుపడేలా ఆ దైవం ఆశీస్సులు అందించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ ఆలపాటి రాంజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ సీనియర్ నాయకులు రమణ, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ ధారపనేని నరేంద్రబాబు, ధామోదర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments