యుకె పార్లమెంట్ పురస్కారం
హైదరాబాద్ – ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ కింగ్ డమ్ పార్లమెంట్ జీవితకాల సాఫల్య పురస్కారం ప్రకటించింది. ఇందుకు సంబంధించి మార్చి 19న ఈ అవార్డును అందుకోనున్నారు. ఇప్పటికే భారతీయ సినీ చరిత్రలో కీలకమైన నటుడిగా గుర్తింపు పొందారు. దక్షిణాది నుంచి సూపర్ స్టార్స్ గా గుర్తింపు పొందారు తమిళనాడు నుంచి రజనీకాంత్ , బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, కన్నడ సినీ రంగం నుంచి శివ రాజ్ కుమార్ ఉండగా తెలుగు చలన చిత్ర రంగం నుంచి చిరంజీవి ఒక్కడే సూపర్ స్టార్ గా వెలుగొందారు.ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా సినీ రంగంలో తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నారు.
ఓ వైపు యువ హీరోలు దుమ్ము రేపుతున్నా సరే తను కూడా టాప్ లో కొనసాగుతుండడం విశేషం. ప్రస్తుతం విశ్వంభర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మినిమం గ్యారెంటీ కలిగిన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో త్వరలో కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. ఇక బ్లడ్ డొనేషన్ ద్వారా పేరు పొందాడు మెగాస్టార్. సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుంటున్నారు అందరికంటే. సాంస్కృతిక పరంగా భారతీయ సినిమాపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన నటులలో తను కూడా ఒకరు. ఇందుకే కేంద్ర సర్కార్ గత ఏడాది 2024లో దేశంలోనే అత్యున్నతమైన రెండో పౌర పురస్కారం పద్మ విభూషణ్ తో గౌరవించింది.