NEWSINTERNATIONAL

పీఎం మోడీపై జెలెన్ స్కీ ఫైర్

Share it with your family & friends

పుతిన్ తో స్నేహ హ‌స్తం పై ఆగ్ర‌హం

ఉక్రెయిన్ – భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు ఉక్రెయిన్ దేశ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ. బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. త‌మ‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతూ, దేశాన్ని స‌ర్వ నాశ‌నం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న ర‌ష్యా చీఫ్ వ్లాదిమీర్ పుతిన్ తో ఎలా క‌ర‌చాల‌నం చేస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇదేనా మీ శాంతి కాముక దేశం అంటూ నిల‌దీశారు.

నిత్యం శాంతి వ‌చ‌నాలు వ‌ల్లించే ప్ర‌ధాన‌మంత్రి ఇలాగేనా వ్య‌వ‌హ‌రించేది అంటూ మండిప‌డ్డారు. ప్ర‌పంచంలోని అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశానికి ప్ర‌తినిధిగా, ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న న‌రేంద్ర మోడీ మాస్కోలో నేర‌స్థుడిగా పేరు పొందిన వ్లాదిమిర్ పుతిన్ ను కౌగిలించు కోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇది పూర్తిగా హింస‌ను ప్రేరేపించ‌డం త‌ప్పా మ‌రోటి కాద‌ని పేర్కొన్నారు జెలెన్ స్కీ.

ఇదిలా ఉండ‌గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కలవడం జెలెన్స్కీకి ఇష్టం లేదు. ఇది శాంతి ప్రయత్నాలకు వినాశకరమైన దెబ్బ అని వాపోయాడు. మొత్తంగా జెలెన్ స్కీ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.