Saturday, April 19, 2025
HomeNEWSANDHRA PRADESHప‌వ‌న్ క‌ళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్

ఆరా తీసిన హోం మంత్రి అనిత

అమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. చంపేస్తామ‌ని హెచ్చ‌రిస్తూ ఆగంత‌కుడి నుంచి ఫోన్ కాల్స్ తో పాటు అభ్యంత‌ర‌క‌ర భాష‌ను ఉప‌యోగిస్తూ మెస్సేజ్ లు వ‌చ్చాయి. ఈ

విష‌యాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేషీలోని సిబ్బంది. బెదిరింపు కాల్స్ పై వెంట‌నే ఉన్న‌తాధికారులకు తెలిపారు. ఈ విష‌యంపై హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆరా తీశారు. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయ్యారు. డీజీపీ ద్వార‌కా తిరుమ‌ల రావుతో మాట్లాడారు.

ఎక్క‌డి నుంచి బెదిరింపు కాల్స్ వ‌చ్చాయ‌నే దానిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని సూచించారు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌నాత‌న ధ‌ర్మం గురించి ఎక్కువ‌గా మాట్లాడుతున్నారు. ఇదే స‌మ‌యంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో నివ‌సిస్తున్న మైనార్టీలు, హిందువుల ప‌రిస్థితి బాగోలేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేశంలోని హిందువులంతా ఒక్క‌టి కావాల‌ని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments