అమ్ముడు పోని బౌలర్ల జాబితా
పీయూష్ చావ్లాకు బిగ్ షాక్
హైదరాబాద్ – జెడ్డా వేదికగా జరిగిన మెగా టాటా ఐపీఎల్ వేలం ముగిసింది. మొత్తం 182 ఆటగాళ్లను రూ. 639 కోట్లు పెట్టి కొనుగోలు చేశాయి ఫ్రాంచైజీలు. చాలా మంది ఆటగాళ్లను పట్టించు కోలేదు. బ్యాటర్లలో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ , పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ ఉండగా బౌలర్లలో పీయూష్ చావ్లా ఉన్నాడు. చావ్లా ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ గా నిలిచాడు. కానీ తనను ఏ ఫ్రాంచైజీ పట్టించుకోక పోవడం విస్తు పోయేలా చేసింది.
ఇక చావ్లాతో పాటు ముస్ఫ్తాఫిజుర్ రెహమాన్, నవీన్-ఉల్-హక్, కార్తీక్ త్యాగిని కూడా తీసుకోలేదు. ఇక అమ్ముడు పోని ఆటగాళ్లు, వారి ధర జాబితా చూస్తే ఇలా ఉంది. వకార్ సలాంఖీల్ రూ. 75 లక్షలు, కార్తీక్ త్యాగి రూ. 40 లక్షలు , చావ్లా రూ. 50 లక్షలు, ముజీబ్ రెహమాన్ రూ. 2 కోట్లు, విజయకాంత్ వియస్కాంత్ రూ. 75 లక్షలు , అకేల్ హుసేన్ రూ. 1.50 కోట్లు , ఆదిల్ రషీద్ రూ. 2 కోట్లు, కేశవ్ మహరాజ్ రూ. 75 లక్షలు, సాకిబ్ హుస్సేన్ రూ. 30 లక్షలతో వేలం పాటలోకి వచ్చారు.
వీరితో పాటు విద్యాత్ కవేరప్ప రూ. 30 లక్షలు, రాజన్ కుమార్ రూ. 30 లక్షలు, సోలంకి రూ. 30 లక్షలు, ఝాత్ వేద్ సుబ్రమణ్యన్ రూ. 30 లక్షలు, ఉమేష్ యాదవ్ రూ. 2 కోట్లు, రిషద్ హుస్సేన్ రూ. 75 లక్షలు, రాఘవ్ గోయల్ రూ. 30 లక్షలు, బైలపూడి యశ్వంత్ రూ. 30 లక్షలు, రిచర్డ్ గ్లీసన్ రూ. 75 లక్షలు, అల్జారీ జోసెఫ్ రూ. 2 కోట్లు, ల్యూక్ వుడ్ రూ. 75 లక్షలు, గులేరియా రూ. 30 లక్షలు, జాసన్ బెహ్రన్ డార్స్ రూ. 1.50 కోట్లు, శివమ్ మావి రూ. 75 లక్షలు, నవదీప్ సైనీ రూ. 75 లక్షలతో వేలం పాటలోకి వచ్చారు.
దివేష్ శర్మ రూ. 30 లక్షలు, నమన్ తివారీ రూ. 30 లక్షలు, ఒట్నేల్ రూ. 75 లక్షలు, మధుశంక్ రూ. 75 లక్షలు, ఆడమ్ మిల్నే రూ. 2 కోట్లు, విలియం రూ. 1.50 కోట్లు, చేతన్ సకారియా రూ. 75 లక్షలు, లాన్స్ మోరిస్ రూ. 1.25 కోట్లు, ఆలీ స్టోన్ రూ. 75 లక్షలు, అన్షుమన్ హూడా రూ. 30 లక్షలు, ముజారబానీ రూ. 75 లక్షలు, విజయ్ కుమార్ రూ. 30 లక్షలు, కైల్ జేమీసన్ రూ. 1.50 కోట్లు, క్రిస్ జోర్డాన్ రూ. 2 కోట్లు, అవినాష్ సింగ్ రూ. 30 లక్షలు, ప్రిన్స్ చౌదరి రూ. 30 లక్షలతో మిగిలి పోయారు.