ఐపీఎల్ వేలంలో వికెట్ కీపర్లకు షాక్
పట్టించుకోని 10 ఫ్రాంచైజీలు
హైదరాబాద్ – ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. కానీ ఊహించని రీతిలో టాప్ వికెట్ కీపర్లను పట్టించు కోలేదు పాల్గొన్న 10 ఫ్రాంచైజీలు. ఇది క్రికెటర్లను, అభిమానులను విస్తు పోయేలా చేసింది. ప్రధానంగా టాప్ లో అద్భుతమైన ప్రదర్శన చేపట్టిన జానీ బెయిర్ స్టోను పక్కన పెట్టాయి. ఈ ఇంగ్లండ్ కు చెందిన క్రికెటర్ మోస్ట్ పాపులర్ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ టోర్నీలో సన్ రైజర్స్ తరపున అద్భుతంగా ఆడినా తనను ఎవరూ కొనుగోలు చేయలేదు.
వీరే కాదు డేవిడ్ వార్నర్, మయాంక్, షా, పీయూస్ చావ్లా, రెహమాన్ లాంటి ఆటగాళ్లను పక్కన పెట్టారు. ఇక వేలం పాటలో ఆయా ఆటగాళ్లు బేస్ ప్రైస్ కు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. జానీ బెయిర్ స్టో రూ. 2 కోట్లు, ఉపేంద్ర యాదవ్ రూ. 30 లక్షలు, షాయ్ హోప్ రూ. 1.25 కోట్లు, కేఎస్ భరత్ రూ. 75 లక్షలు, అలెక్స్ కారీ రూ. 1 కోటి రూపాయలు, అవనీస్ అరవెల్లి రూ. 30 లక్షలకు వచ్చినా వర్కవుట్ కాలేదు.
ఇక వీరితో పాటు హార్విక్ దేశాయ్ రూ. 30 లక్షలు, జోష్ ఫిలిప్ రూ. 75 లక్షలు, ఎల్ ఆర్ చేతన్ రూ. 30 లక్షలు, తేజస్వి దహియా రూ. 30 లక్షలతో మిగిలి పోయారు. అయితే వీరికి మరో ఛాన్స్ కూడా ఉంది. ప్రధానంగా ప్రస్తుతం ఎంపిక చేసిన ఆటగాళ్లలో ఎవరైనా గాయపడినా లేదా వెనుదిరిగినా వీరిని ఎంచుకునేందుకు వీలుంటుంది.