విభజనతో ఏపీకి అన్యాయం
అమరావతి – మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ విభజన అంశం గురించి. ఆయన పదే పదే దీని గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. మంగళవారం ఆయన సుదీర్ఘమైన లేఖను సంధించారు. ఏకంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదలకు రాశారు.
ఇందులో ప్రత్యేకంగా విభజన కారణంగా ఏపీకి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. దీనిని సరిదిద్దే బాధ్యతను డిప్యూటీ సీఎం తీసుకోవాలని కోరారు. లేక పోతే మరింత అన్యాయం జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ఇప్పటికే కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీతో జనసేన , టీడీపీ కలిసే ఉన్నాయని, ప్రస్తుతం కూటమి సర్కార్ నడుస్తోందని అన్నారు. దీని కారణంగా యుద్ద ప్రాతిపదికన బాధ్యత కలిగిన పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ దీనిని భుజానికి ఎత్తుకుని అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.
అంతే కాకుండా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యను కొలిక్కి తీసుకురావాలని స్పష్టం చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్.