రాజీ పడని వ్యక్తి రామోజీ
ఉండవల్లి అరుణ్ కుమార్
అమరావతి – మాజీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామోజీ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు జాతికి తీరని నష్టం అని పేర్కొన్నారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఆయన లేరన్న వార్త తనను ఎంతో బాధకు గురి చేసిందన్నారు. ఇదిలా ఉండగా ఉండల్లి అరుణ్ కుమార్ కొన్నేళ్ల పాటు రామోజీరావుతో విభేదించారు. ఆయనపై ప్రత్యక్షంగా పోరాటానికి దిగారు.
మార్గదర్శి చిట్ ఫండ్స్ ను అనైతికంగా నిర్వహిస్తున్నారంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ఈ సందర్బంగా కేసులు కూడా నమోదయ్యాయి. రామోజీ రావు చని పోయేంత వరకు పోరాడుతూనే ఉన్నారు. వీరిద్దరి మధ్య మాటల యుద్దం కొనసాగుతూ వచ్చింది.
రామోజీ రావు ఎవరితోనూ రాజీ పడని వ్యక్తి అని, చివరి దాకా అలాగే గడిపారంటూ కొనియాడారు ఉండవల్లి అరుణ్ కుమార్. తాను చాలాసార్లు తనను కలవాలని అనుకున్నానని కానీ కలవలేక పోయానని చెప్పారు.