ట్యాక్స్ పేయర్స్ కు ఖుష్ కబర్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ – పన్ను ఎగవేతదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. కొంత మేరకు తక్కువ చేస్తున్నట్లు ప్రకటించారు పార్లమెంట్ లో ఇవాళ బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్బంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పటి వరకు ప్రకటించిన ట్యాక్స్ స్లాబ్ లను మారుస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా కొత్త పన్ను విధానంలో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం.. సున్నా నుంచి రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదని అన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక రూ. 3 నుంచి 7 లక్షల వరకు 5 శాతం ట్యాక్స్ పేయాల్సి ఉంటుందన్నారు.
మరో వైపు రూ.7 నుంచి 10 లక్షల వరకు 10 శాతం పన్ను.. రూ.10-12 లక్షల వరకు 15 శాతం ట్యాక్స్ చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. రూ.12- 15 లక్షల 20 శాతం శాతం పన్ను.. రూ.15 లక్షల పైన 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు నిర్మలా సీతారామన్.
ఇదే సమయంలో బీహార్‌లో రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేశారు.. రూ.26,000కోట్లు ప్రకటించిన కేంద్రం.. రాజ్‌గిరి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. నలంద యూనివర్సిటీని టూరిస్ట్ సెంటర్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
భూముల పరిరక్షణ కోసం డిజిటల్ భూ- ఆధార్.. రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీలేని రుణాలు.. స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి.. మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు