NEWSNATIONAL

25 వేల గ్రామాల‌కు మ‌హ‌ర్ద‌శ‌

Share it with your family & friends

ప్ర‌క‌టించిన నిర్మ‌లా సీతారామ‌న్

న్యూఢిల్లీ – పార్ల‌మెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2024-25కు సంబంధించి వార్షిక బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్బంగా విద్యా, వైద్యం, యువ‌త‌, వ్యవ‌సాయం, సాంకేతిక రంగాల‌కు ప్ర‌యారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా దేశంలోని 25 వేల గ్రామాల‌కు కొత్త‌గా ర‌హ‌దారులు నిర్మిస్తామ‌న్నారు.

బీహార్‌లో వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేందుకు. కోసీ నదిపై ప్రాజెక్టులు, నదుల అనుసంధానానికి రూ.11,500 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు విత్త మంత్రి… అసోంలో బ్రహ్మపుత్ర వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింద‌ని, అసోంలో ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేయ‌నున్న‌ట్లు తెలిపారు.

సిక్కిం, ఉత్తరాఖండ్‌లో వరదలు, భారీ వర్షాలతో తీవ్ర నష్టం.. ఈ రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక సాయం.. గయా బుద్ధగయాలో కాశీ తరహా కారిడార్‌.. ఒడిశాలోన ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు నిర్మలా సీతారామన్.

ఇక ఈ-కామర్స్ సంస్థలకు టీడీఎస్ తగ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో తగ్గనున్న ధరలు.. జీఎస్టీ కారణంగా సామాన్యూలపై భారం తగ్గ‌కుండా చూస్తామ‌న్నారు.. మరింత సరళంగా, హేతబద్దంగా జీఎస్టీని మార్చుతామ‌ని ప్ర‌క‌టించారు.. ఐటీ ఫైలింగ్ గడువు దాటినా నేరం కాదన్నారు.. స్టార్టప్స్‌పై ఏంజల్ ట్యాక్స్ రద్దు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.