సంచలన ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్
ఢిల్లీ – కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేశారు. దేశంలోని మధ్యతరగతి ప్రజలకు తీపి కబురు చెప్పారు. ఒక సంవత్సరంలో 12 లక్షల వరకు ఎలాంటి ఆదాయ పన్ను కట్టాల్సిన పని లేదని ప్రకటించారు. వార్షిక ఆదాయానికి ఇది వర్తిస్తుందని చెప్పారు. పార్లమెంట్ లో చేసిన కేంద్ర మంత్రి ప్రకటన కలకలం రేపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సభ్యులంతా కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. ఆహార శుద్ధికరణకు సంబంధించి పూర్వోదయ కార్యక్రమం తీసుకువస్తామన్నారు. నిర్వహణ కోసం బీహార్‌లో సంస్థను స్థాపిస్తామన్నారు. ఆహార శుద్ధికరణ తూర్పు ప్రాంతమంతా విస్తరిస్తామని ప్రకటించారు.
రైతులకు మరింత ఆదాయం తీసుకు రావడంతో పాటు వారి ఉత్పత్తులకు విలువ ఇస్తామని తెలిపారు నిర్మలా సీతారామన్. దీని వల్ల ఉపాధి ఎక్కువగా దొరికే ఛాన్స్ ఉందన్నారు. అంతే కాకుండా బొమ్మల తయారీకి ఇండియాను కేరాఫ్ గా మారుస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఒక పథకాన్ని తీసుకు వస్తామన్నారు . కొన్ని ప్రాంతాలను గుర్తించి నైపుణ్యం కలిగిన బొమ్మల తయారీకి ప్రోత్సహిస్తామన్నారు.