అమరావతి రైల్వే లైన్ కు లైన్ క్లియర్
ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
అమరావతి – కేంద్ర ప్రభుత్వం ఖుష్ కబర్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజధాని అమరావతి నగరానికి నూతన రైల్వే నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఈ రైల్వే లైన్ నిర్మాణం మొత్తం 57 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి మొత్తం రూ. 2,245 కోట్లు ఖర్చువుతుందని అంచనా వేసింది. దీనిని కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు అశ్విని వైష్ణవ్. ఇదిలా ఉండగా ఇప్పటికే ముమ్మాటికీ ఏపీ రాష్ట్రానికి సంబంధించి అమరావతినే రాజధాని ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ఈమేరకు పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు ఆమోదం తెలియ చేయాలని కోరారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో పాటు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి విన్నవించారు. సీఎం, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ లు చేసిన ప్రయత్నం ఫలించింది. ఎట్టకేలకు ఆమోదం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సీఎం.