వక్ఫ్ బోర్డు బిల్లుపై కాంగ్రెస్ రాజకీయం
నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్ – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత దేశానికి దిశా నిర్దేశం చేసేందుకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించారని , కానీ దానికి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
వారి పాలనా కాలంలోనే దేశం మరో వందేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. తాము వచ్చాక, నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం ముందుకు పరుగులు పెడుతోందన్నారు. అన్ని రంగాలలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుందన్నారు.
కాంగ్రెస్ పదే పదే అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇదే సమయంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ కావాలని రాజకీయాలు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని , రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పడం ఖాయమన్నారు.