NEWSNATIONAL

గిరి రాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

Share it with your family & friends

ముస్లింలు నాకు ఓటు వేయ‌లేదు

న్యూఢిల్లీ – కేంద్ర మంత్రి గిరి రాజ్ సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ త‌న‌కు తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ముస్లింలు ఓటు వేయ‌లేద‌ని ఆరోపించారు. తాను ప్ర‌భుత్వ ప‌రంగా అమ‌లు చేసే సంక్షేమ ప‌థ‌కాలు వారికి ఎందుకు ఇవ్వాల‌ని ప్ర‌శ్నించారు. ఆయ‌న చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేపుతున్నాయి.

వారు నాకు ఓటు వేయ‌లేద‌ని, మ‌రి తాను ఎందుకు వారి కోసం , వారి అభివృద్దికి సంబంధించి ఆలోచించాల‌ని ప్ర‌శ్నించారు కేంద్ర మంత్రి గిరి రాజ్ సింగ్. నా ప్రాంతంలో ఒక మౌల్వీకి ఇల్లు, ఎల్పీజీ ఉజ్వ‌ల‌, రూ. 5 ల‌క్ష‌ల విలువైన ఆయుష్మాన్ , టాయిలెట్ , రేష‌న్ సౌక‌ర్యాలు ఉన్నాయ‌ని చెప్పారు.

ఈ సంద‌ర్బంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో తాను త‌న‌కు ఓటు వేశాన‌ని ప్ర‌మాణం చేయమ‌ని తాను అడిగాన‌ని , ఆయ‌న అందుకు ఒప్పు కోలేద‌న్నారు. దీంతో త‌న గుండె ప‌గిలి పోయింద‌న్నారు. వీరి కోస‌మేనా తాను ఇంత‌గా క‌ష్ట ప‌డ్డాన‌ని అని అన్నారు గిరి రాజ్ సింగ్.