ENTERTAINMENT

అల్లు అర్జున్ ఇంటిపై దాడి దారుణం

Share it with your family & friends

కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్ – కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లో అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల‌తో దాడి చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ పూర్తిగా గాడి త‌ప్పింద‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న‌లో క‌ళాకారులు, సినీ ప‌రిశ్ర‌మ‌ను టార్గెట్ చేయ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇలాంటివి జ‌ర‌గ‌కుండా చూడాల‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ఈ మొత్తం వ్య‌వ‌హారంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆయ‌న అల్లు అర్జున్ ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏం సాధించాడ‌ని సినీ సెలిబ్రిటీలు క్యూ క‌ట్టారంటూ ప్ర‌శ్నించారు.

అల్లు అర్జున్ కు ఏమైంద‌ని సంద‌ర్శించార‌ని, ప‌రామ‌ర్శించారంటూ ఎద్దేవా చేశారు. అంతే కాదు ఆయ‌న‌కు ఏమైనా కాలు పోయిందా, కిడ్నీలు పాడ‌య్యాయా అంటూ మండిప‌డ్డారు ముఖ్య‌మంత్రి. ఇదే స‌మ‌యంలో ఏసీపీ విష్ణు మూర్తి తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. త‌మ జోలికి వ‌స్తే తోలు తీస్తామంటూ హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ల‌క్షా 30 వేల మంది పోలీస్ కుటుంబాల‌ను కించ ప‌రిచేలా మాట్లాడితే బాగుండ‌దంటూ హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *