దీదీ వైఫల్యం బీజేపీ ఆగ్రహం – సుకాంత
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..నిరసనలు
కోల్ కతా – కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ నిప్పులు చెరిగారు. పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. సోమవారం సుకాంత మజుందార్ మీడియాతో మాట్లాడారు.
డాక్టర్ అత్యాచార ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ప్రధానంగా సీఎం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి.
ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రేప్-మర్డర్ ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన బాధాకరమని అన్నారు. నిందితులు ఎవరైనా సరే కఠిన శిక్ష పడాలని అన్నారు.
బిజెపి నిరసన కొనసాగించాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు సుకాంత మజుందార్. కోల్కతాలోని 15 ప్రధాన ప్రదేశాలలో మహిళా మోర్చా నేతృత్వంలో ఆందోళనలు , నిరసనలు చేపడతామని చెప్పారు. ప్రత్యేకించి మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఆగస్ట్ 21న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతారని చెప్పారు సుకాంత మజుందార్, 23న మా మహిళా మోర్చా నిరసన కొనసాగుతుందని తెలిపారు. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.