పత్రిక అందజేసిన యూపీ డిప్యూటీ సీఎం
అమరావతి – ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మర్యాద పూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలుసుకున్నారు.
వచ్చే ఏడాది జనవరిలో పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా నిర్వహిస్తున్నారు. ఇందు కోసం దేశ వ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానిస్తోంది యూపీ సర్కార్. ఇందులో భాగంగా సీఎం యోగి ఆదిత్యా నాథ్ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆహ్వాన పత్రికలను అందజేస్తూ వస్తున్నారు.
చంద్రబాబుతో పాటు గవర్నర్ నజీర్ కు మహా కుంభ మేళాకు రావాలని కోరారు. ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఉప ముఖ్యమంత్రి మౌర్యతో పాటు బీజేపీ రాష్ట్ర ఎలక్షన్ కో కన్వీనర్ సిద్దార్త్ సింగ్ ను ఘనంగా సన్మానించారు చంద్రబాబు నాయుడు. వారికి శ్రీ వేంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కూడా ఉన్నారు.