దుర్గమ్మ సన్నిధిలో యుపీ డిప్యూటీ సీఎం
దేశ ప్రజలు..పీఎం మోడీ బాగుండాలి
అమరావతి – ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన బెజవాడలోని ప్రముఖ దేవాలయం, కోరిన కోర్కెలు తీర్చే శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఉప ముఖ్యమంత్రి రాక సందర్బంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులతో పాటు పూజారులు ఉప ముఖ్యమంత్రి మౌర్యకు సాదర స్వాగతం పలికారు. అనంతరం పూజారులు వేదాశ్వీరచనాలు అందజేశారు.
కనకదుర్గమ్మ చిత్ర పటంతో పాటు ప్రసాదాన్ని అందజేశారు. ఉప ముఖ్యమంత్రితో పాటు యూపీకి చెందిన ఎమ్మెల్యే సిద్దార్థనాథ్ సింగ్ కూడా ఉన్నారు. అమ్మ వారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి. అమ్మ వారి ఆశీస్సులు పీఎం మోడీకి, దేశ ప్రజలకు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు డిప్యూటీ సీఎం.
అమ్మ వారిని దర్శించు కోవడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు . ఈసారి కనీ విని ఎరుగని రీతిలో కుంభమేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు.