బిన్నీని కలవడం ఆనందం
ఊర్మిళా గజపతి రాజు
విశాఖపట్టణం – ఊర్మిళ గజపతి రాజు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పేరు పొందారు. రాజుల వారసత్వానికి ప్రతీకగా ఉన్నారు. విద్యాధికురాలిగా గుర్తింపు పొందారు. మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కు బంధువు కూడా.
ఇదిలా ఉండగా ఊర్మిళా గజపతి రాజు వైరల్ గా మారారు. ఇందుకు వేదిక వైజాగ్ స్టేడియం మారింది. ఇక్కడ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు , ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరిగింది. 5 టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో ఘోరంగా ఓటమి పాలైంది ఆతిథ్య టీమిండియా.
ఇక రెండో టెస్టుకు విశాఖ నగరం ఆతిథ్యం ఇచ్చింది. భారీ ఎత్తున క్రికెట్ అభిమానులు ఆదరించారు. ఈ టెస్టు మ్యాచ్ కు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఊర్మిళ గజపతి రాజు వీరిద్దరిని కలుసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.