శ్రీలంక అధ్యక్షుడితో యుఎస్ రాయబారి భేటీ
కొత్త అధ్యక్షుడికి అభినందనల వెల్లువ
శ్రీలంక – శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకేను మంగళవారం అమెరికా దేశ శ్రీలంక రాయబారి చుంగ్ భేటీ అయ్యారు. మర్యాద పూర్వకంగా కలుసుకున్నట్లు ఈ సందర్బంగా పేర్కొన్నారు చుంగ్.
శ్రీలంక ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ లో యుఎస్ అంబాసిడర్ కలుసుకుని కీలక అంశాలపై చర్చించారు. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన దేశ అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించారు అనుర కుమార దిస్సనాయకే.
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షుడిని ప్రత్యేకంగా చుంగ్ అభినందనలతో ముంచెత్తారు. విచిత్రం ఏమిటంటే అమెరికాకు కమ్యూనిజం అంటే పడదు. కానీ ఇక్కడ ఇప్పుడు అరుణ పతాకం ఎగుర వేశాడు అనుర కుమార దిస్సనాయకే.
ప్రెసిడెంట్ తో యునైటెడ్ స్టేట్స్, శ్రీలంక దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి గురించి చర్చించారు.
దౌత్య సంబంధాలను బలోపేతం చేయడం, ఆర్థిక, సామాజిక సహకారాన్ని పెంపొందించడం, రెండు దేశాల మధ్య పరస్పర ఆసక్తి ఉన్న రంగాలను అన్వేషించడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. ఇదిలా ఉండగా తనను కలుసుకున్న యుఎస్ రాయబారి చుంగ్ ను అభినందించారు అనుర కుమార దిస్సనాయకే.