బెంగళూరులో యూఎస్ కాన్సులేట్ ప్రారంభం
జనవరిలో ప్రారంభిస్తామన్న రాయబారి
కర్ణాటక – భారతదేశంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కీలక ప్రకటన చేశారు. వచ్చే జనవరి నెలలో బెంగళూరులో కాన్సులేట్‌ను ప్రారంభించేందుకు అమెరికా తన నిబద్ధతతో పనిచేస్తోందని వెల్లడించారు.
అమెరికా – ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బెంగళూరు ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరు పొందిందని చెప్పారు. ఇక్కడి నుంచి ఎక్కువగా యుఎస్ కు వెళతారని తెలిపారు.
అత్యంత త్వరగా ప్రారంభించాలని అమెరికా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు ఎరిక్ గార్సెట్టీ. బెంగళూరు, అహ్మదాబాద్‌లలో రెండు కొత్త కాన్సులేట్‌లను ప్రారంభించనున్నట్లు అమెరికా గతంలోనే ప్రకటించింది.
బెంగుళూరులో కాన్సులేట్ లేని ఏకైక ప్రధాన దేశం అమెరికా మాత్రమే అని గార్సెట్టి చెప్పారు. కాబట్టి మేము దానిపై చాలా కష్టపడుతున్నామని అన్నారు. ఇదే విషయంపై తాను పదే పదే తమ దేశ ప్రభుత్వంతో చర్చించడం జరుగుతోందన్నారు. సాధ్యమైనంత త్వరలోనే ఇది పూర్తవుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.