గౌతమ్ అదానీ..సాగర్ అదానీలపై అరెస్ట్ వారెంట్లు
జారీ చేసిన అమెరికా అత్యున్నత న్యాయస్థానం
అమెరికా – భారత దేశానికి తలవంపులు తీసుకు వచ్చేలా వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై తీవ్రమైన ఆరోపణలు మోపింది అమెరికా అత్యున్నత న్యాయస్థానం. ఈ మేరకు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
అంతర్జాతీయ పరంగా భారత్ కు తలవంపులు తీసుకు వచ్చింది మోడీ గ్యాంగ్. భారతీయ అధికారులకు లంచం ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్లు వీరిపై అభియోగాలు మోపింది. బహుళ-బిలియన్ డాలర్ల సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ స్కీమ్‌లో అమెరికన్ పెట్టుబడిదారులను మోసగించడంతో పాటు లంచం ఇచ్చినట్లు అదానీ గ్రూప్ చైర్మన్ పై యుఎస్ సెక్యూరిటీ కమిషన్ (ఎస్ ఈ సీ) ఆరోపించింది.
62 ఏళ్ల గౌతమ్ అదానీతో పాటు 30 ఏళ్లు కలిగిన మేనల్లుడు సాగర్ అదానీ పై ప్రధాన ఆరోపణలు గుప్పించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్‌లు, అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ సిరిల్ కాబనేస్‌పై సెక్యూరిటీలకు కుట్ర పన్నారని అభియోగాలు మోపారు.
పునరుత్పాదక ఇంధన సంస్థలైన అదానీ గ్రీన్ , అజూర్ పవర్‌లకు భారత ప్రభుత్వం అందించిన బహుళ-బిలియన్-డాలర్ల సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్‌పై పెట్టుబడి పెట్టడానికి లంచం పథకం ప్లాన్ చేశారంటూ ఎస్ఈసీ ఆరోపించింది.
ఫెడరల్ సెక్యూరిటీస్ చట్టాల యాంటీఫ్రాడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది. అదానీ గ్రీన్ యుఎస్ పెట్టుబడిదారుల నుండి 175 మిలియన్లకు పైగా సేకరించిందని తెలిపింది. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు 2020, 2024 మధ్య కాలంలో USD 2 బిలియన్ల కంటే ఎక్కువ విలువైన సౌరశక్తి ఒప్పందాలను పొందేందుకు అదానీ, అనుచరులు కలిసి $250 మిలియన్లకు పైగా లంచాలు చెల్లించారని ఆరోపించింది.