కెనడాకు భారత్ సహకరించాలి – యుఎస్
పీఎం మోడీకి సూచించిన బైడెన్..హారీస్
అమెరికా – భారత, కెనడా దేశాల మధ్య నెలకొన్న దౌత్య పరమైన ఇబ్బందుల దృష్ట్యా పెద్దన్న అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే కెనడా నుంచి భారత్ హైకమిషనర్ వర్మతో పాటు ఇతర దౌత్య సిబ్బందిని భారత్ కు రావాలని ఆదేశించింది. వీరంతా కెనడాలో ఖాళీ చేసి స్వదేశానికి విచ్చేశారు. భారతీయులకు కెనడాలో రక్షణ లేదని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఇదే సమయంలో భారత దేశంలో ఉన్న కెనడా రాయబారి, ఇతర దౌత్య సిబ్బందిని తక్షణమే భారత దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. ఏ మాత్రం ఆలస్యం చేసినా ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది. దీంతో కెనడా పీఎం ట్రూడోకు బిగ్ షాక్ తగిలినట్లయింది.
పరిస్థితి ఇరు దేశాల మధ్య పూర్తిగా సంబంధాలు తెగి పోయే ప్రమాదం ఉందని గ్రహించింది అమెరికా ప్రభుత్వం. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ , ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ స్పందించారు. కెనడాకు భారత్ సహకరించాలని కోరారు. అయితే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కెనడాకు అమెరికా సహాయ, సహకారాలు అందజేస్తుందని ప్రకటించారు.
కెనడియన్ విషయానికి వస్తే, ఆరోపణలు చాలా తీవ్రమైనవని, వాటిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని తాము స్పష్టం చేశామని పేర్కొంది అమెరికా.