ఆ రెండు దేశాలు పరిష్కరించుకోవాలి
అమెరికా – యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డడ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా గర్హనీయమని పేర్కొన్నారు. మృతులపై కాల్పులకు దిగడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ ఘటన జరగడం బాధాకరమని, తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. భారత్, పాక్ మధ్య కశ్మీర్ విషయంలో చాలా ఏళ్లుగా గొడవ జరుగుతోందని అన్నారు. అయితే, దాన్ని ఆ రెండు దేశాలే పరిష్కరించు కుంటాయని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్.
రోమ్ పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్-పాక్ ఉద్రిక్తతలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. భారత్ , పాకిస్తాన్ దేశాలు తమకు దగ్గరని అన్నారు. పర్యాటకులపై జరిగిన దాడి చెత్త పనిగా పేర్కొన్నారు. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచి వేసిందన్నారు ట్రంప్. ఇదిలా ఉండగా. సైనిక దుస్తుల్లో వచ్చినవారు పర్యాటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదే ఘటనపై ఇరాన్ స్పందించింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కీలక ప్రతిపాదన చేసింది. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించింది. ఇరు దేశాల మధ్య తమ దేశానికి సత్ సంబంధాలు ఉన్నాయని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చెప్పారు.