పీఎం మోడీ పేరు మరిచి పోయిన బైడెన్
యుఎస్ క్వాడ్ సదస్సులో యుఎస్ ప్రెసిడెంట్
అమెరికా – మరోసారి అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ చర్చ నీయాంశంగా మారారు ప్రపంచ వ్యాప్తంగా. మూడు రోజుల పర్యటనలో ఉన్నారు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. యుఎన్ క్వాడ్ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
అంతకు ముందు ప్రధాన మంత్రి మోడీ స్వయంగా అమెరికా దేశాధ్యక్షుడు జో బైడెన్ నివాసానికి వెళ్లారు. ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అమెరికా, భారత దేశాల మధ్య సంబంధాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇదిలా ఉండగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మధ్యన జో బైడెన్ వయస్సు ప్రభావం రీత్యా పలువురు ప్రముఖుల పేర్లను మరిచి పోతున్నారు. తాజాగా క్వాడ్ వేదికగా ప్రసంగించారు జో బైడెన్. క్వాడ్ మీట్ లో వేదికపై ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పేరు ప్రస్తావించడం మరిచి పోవడం విస్తు పోయేలా చేసింది.
బైడెన్ ప్రసంగించిన సమయంలో ఉన్నట్టుండి ఇక్కడ హాజరైన వారందరికీ ధన్యవాదాలు అంటూ చెప్పారు. కానీ తన స్నేహితుడైన నరేంద్ర మోడీ పేరు చెప్పడాన్ని చెప్పక పోవడంతో అందరూ విస్మయానికి లోనయ్యారు. మొత్తంగా బైడెన్ తన మతి మరుపును మరోసారి బయట పెట్టుకున్నారు.